పయనించే సూర్యడు: మార్చి 16: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, సోమవారం ములుగు జిల్లా డి ఎం హెచ్ ఓ మరియు టిబి ప్రోగ్రాం అధికారి, సూచనల మేరకు క్షయ వ్యాధి గురించి అవగాహన క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యులు మాట్లాడుతూభారతదేశ అభివృద్ధి జరగాలంటే ప్రతి పౌరుడు ఆరోగ్యంగా జీవించాలని, అలాగే క్షయ మహమ్మారి నుంచి బయటపడాలని తదనంతరం క్షయ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. ఒక క్షయ వ్యాధిగ్రస్తుని వలన 13 మందికి వ్యాధి సోకే అవకాశం ఉన్నందున మనకు ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా అనే నిర్ధారణ చేసుకొనుటకు మూడు వారాలకు పైన దగ్గు, ఛాతీ లో నొప్పి ,దగ్గినప్పుడు రక్తం పడడం ,సాయంత్రం పూట జ్వరం రావడం ,
రాత్రిపూట చెమట పట్టడం, ఆకలి మందగించడం , బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్న వెంటనే వచ్చి వ్యాధి నిర్ధారణ కోసం తెమడ పరీక్ష చేయించుకోవలెనని తెలిపారు. ఈ కార్యక్రమంలో HEO వేణుగోపాలకృష్ణ, PHN సంగీత, STLS రవి, TB నోడల్ పర్సన్ శ్రీను, ANM శకుంతల, ఫార్మసిస్ట్ సతీష్ , తదితరులు పాల్గొన్నారు.