జూలూరుపాడుపయనించే సూర్యుడు. (జనవరి14)ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా గంగోత్రి న్యూట్రింట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వారి ఆధ్వర్యంలో జూలూరుపాడు మండలం గంగారం తండా గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో గెలిచిన మొదటి ముగ్గురుకు చీరలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. మరియు పాల్గొన్న అందరికీ కూడా బహుమతి ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో ఆనంద వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమం మొదటిసారిగా మా ఊర్లో నిర్వహించినందుకు కంపెనీ వారికి ధన్యవాదములు అని గ్రామ పెద్దలు సర్పంచ్ మరియు మండల అధ్యక్షులు ఆనంద వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కంపెనీ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ , సీనియర్ సేల్స్ ఆఫీసర్. నాగరాజు, డెవలప్మెంట్ ఆఫీసర్ రమేష్ మరియు గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.