పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి ఆగస్టు 2
చింతూరు సబ్ డివిజన్ పరిధిలో నివసిస్తున్న గంజాయి కేసు నిందితులకు చింతూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం నందు చింతూరు అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఐపిఎస్ కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి పంటను సాగు చేయడం, గంజాయిని రవాణా చేయడం, గంజాయిని తాగడం నేరమని, గంజాయి రవాణా విషయంలో పైలట్ కి వెళ్లడం, కూలి పనికి వెళ్లడం కూడా నేరమని తెలియజేశారు. గంజాయి సంపాదనతో సంపాదించిన ఆస్తులన్నిటిని ప్రభుత్వం జప్తు చేస్తుందని అందువల్ల గంజాయి జోలికి వెళితే కుటుంబాలు నాశనం అవుతాయని తెలిపారు. గంజాయి కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరిపై పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి, వారిపై నిఘా ఉంచుతామని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తామని తెలిపారు. మళ్ళీ ఇంకో గంజాయి కేసుల్లో ఇరుక్కుంటే వారిపై పిట్ ఎన్ డి పి ఎస్ చట్టం కింద జైల్లో నిర్బంధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా మంచి మార్గంలో నడిచి, సమాజంలో మంచి పేరు తెచ్చుకొని జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతూరు సిఐ గోపాలకృష్ణ గారు, వేటపాక సీఐ కన్నప్ప రాజు, డొంకరాయి ఎస్ఐ శివకుమార్ చింతూరు ఎస్ఐ రమేష్ మోతుగూడెం ఎస్ఐ సాదిక్ పాల్గొన్నారు.