పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు నాలుగు 4
చింతూరు లోని ఆటో డ్రైవర్లకు సిఐ గోపాలకృష్ణ, ఎస్సై పి రమేష్ గంజాయి రవాణా గూర్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. చింతూరు పోలీస్ స్టేషన్లో సోమవారం మండలంలోని ఆటో డ్రైవర్లను పిలిపించి గంజాయి రవాణా పై కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి రవాణా చేయటం,సేవించడం, దాచి ఉంచటం, వ్యాపారస్తులకు సహకరించడం, పైలెట్ గా వ్యవహరించడం నేరమని అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, గంజాయి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు యూనిఫామ్ ధరించాలని అన్నారు. అంతేకాక ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, ఆటోకు సంబంధించిన సి బుక్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్లు లేని వాహనాలను జప్తు చేస్తామని సీఐ హెచ్చరించారు. అలాగే, అధిక స్పీడ్ అన్నిటికీ అనర్ధమని, ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందని, అధిక స్పీడు వెళ్లినా కేసులు తప్పవని, పరిమితికి మించి వాహనంలో ప్యాసింజర్ ని ఎక్కించరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.