పయనించే సూర్యుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి... ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు
కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డ్ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తో కలిపి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాల స్వామి ఆలయాన్ని పరిశీలించారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డు లోని జిహెచ్ఎంసి ఆధీనంలో ఉండే రమ్య గ్రౌండ్ పార్కు స్థలాన్ని సైతం హౌసింగ్ బోర్డ్ అధికారులు బోర్డులు పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రజల సౌకర్యార్థం కె.పి.హెచ్.బి కాలనీలో మహిళా పార్కులు, చిల్డ్రన్ పార్కులను , ఆట స్థలాలను క్రికెట్ గ్రౌండ్ లను ఏర్పాటు చేశామని దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి సర్కార్ హౌసింగ్ బోర్డ్ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు దండుకోవడం దారుణమన్నారు. హౌసింగ్ బోర్డ్ స్థలాలలో ప్రజాప్రయోజనార్ధం పది శాతం భూములను గుడులకు బడులకు పార్కులకు కేటాయించాలని ఎలాంటి కేటాయింపులు చేయకుండా వేలం పాటలు ఏ విధంగా వేస్తారని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న దేవాలయ మండపానికి ఎవరికీ చెప్పకుండా ఎలా సీజ్ చేస్తారని కనీసం పంచనామా జరపకుండా ఆలయ సిబ్బందికి కమిటీకి చెప్పకుండా అధికారులు ఎలా సీట్ చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధోరణి మార్చుకోకపోతే ఈనెల ఇరవై నాలుగవ తారీఖున జరిగే వేలం పాటను అడ్డుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, సతీష్ అరోరా, డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి, శ్యామల రాజు, రాజేష్,పవన్, పి.ఎల్ ప్రసాద్, సాయి,తదితరులు పాల్గొన్నారు.