పయనించే సూర్యడు జనవరి 30 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దర్ పై విమర్శలు చేయడం బిజెపి ఎంపీ బండి సంజయ్ కు తగదని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ.. బండి సంజయ్ తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి, శ్రీనివాస్, నర్సిరెడ్డి సత్యనారాయణ,వెంకన్న లింగయ్య,మౌలాన,భిక్షం, పాల్గొన్నారు.