
*రక్త నిధిని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన అల్లాడి స్వామి నాయుడు
పయనించే సూర్యుడు జూలై 16 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ), ఉప్పలగుప్తం మండలం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గని శెట్టి అరవింద్ జన్మదిన వేడుకలను సన్నవల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం అభివృద్ధి సంస్థ అధ్యక్షులు అల్లాడ స్వామి నాయుడు హాజరై రక్త నిధిని ప్రారంభించారు. అరవింద్‌కు శాలువా కప్పి, ఫలహారాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్త నిధి ప్రారంభోత్సవం అనంతరం రక్తదానం చేసిన దాతలను అభినందించారు.ఈ సందర్భంగా అల్లాడ స్వామి నాయుడు మాట్లాడుతూ, పుట్టినరోజును సామాజిక సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీ యమన్నారు. యువ నాయకుడిగా అరవింద్ చేస్తున్న సేవలు యువతకు ఆదర్శమని కొనియాడారు. రక్తదానం వల్ల అనేక ప్రాణాలు నిలబడతాయని, ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.గని శెట్టి అరవింద్ మాట్లాడుతూ, తనపై అభిమానం చూపిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.ఈ వేడుకల్లో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ అధ్యక్షులు చిక్కాల గణేష్, రాష్ట్ర ఆక్వా అభివృద్ధి సంస్థ సంచాలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, ఆత్మ అధ్యక్షులు చిక్కం సుధ, కొర్లపాటి గోపి, గునిశెట్టి చినబాబు, నల్లా చిట్టిబాబు, మోకా సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు.కార్యక్రమంలో నాయకులు అరవింద్‌ను శాలువాతో సన్మానించారు. రిబ్బన్ కట్ చేసి రక్త నిధిని ప్రారంభించారు. ఫోటోలు తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అంతా ఆనందోత్సాహాల మధ్య సాగింది.