పయనించే సూర్యుడు,ఫిబ్రవరి 12 ( వైరా నియోజకవర్గ రిపోర్టర్ ఆదూరి ఆనందం )వైరా మండలం, గన్నవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో బహుజన అభ్యుదయ సేవా సమితి, హ్యూమన్ రైట్స్ సొసైటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిల్లుముంత వెంకటేశ్వరావు అధ్యక్షతన జరిగిన బాలల హక్కుల అవగాహన సదస్సు లో విద్యార్థినీలకు,విద్యార్థులకు మానవ హక్కులు- చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ మా పనులు మేము చేసుకుంటూ కొంత సమయాన్ని మానవ హక్కులను ప్రచారం చేయడానికి స్వచ్చందంగా పనిచేస్తూ , ఆశా కార్యకర్తలకు డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు, అంగన్వాడీ లకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాడ్ టచ్, గుడ్ టచ్ మొదలగు వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం హ్యూమన్ రైట్స్ సొసైటీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆదూరి మణి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిలూరి శ్రీనివాసరెడ్డి బాల్య వివాహాలు, బాలల హక్కులు, డ్రగ్స్, మైనర్ డ్రైవింగ్ పలు చట్టాలను వివరించారు. అనంతరం పాఠశాల ఇంచార్జ్ డి.రాంబాబు మాట్లాడుతూ బహుజన అభ్యుదయ సేవా సమితి, హ్యూమన్ రైట్స్ సొసైటీ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద వృద్దులకు సహాయం చేస్తూ ఈ రోజు పాఠశాల లో చదివే విద్యార్థులకు మానవ హక్కులు - చట్టాలను ప్రచారం చేస్తున్న హ్యూమన్ రైట్స్ సొసైటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు యం.సుధీర్, ఎస్.డి.అసిఫ్ పాషా, యం.డి.రఫీ, భద్రు, ఎ. నాగేశ్వరావు, పి. జయకుమార్, ఎ. కళావతి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.