పయనించే సూర్యుడు మార్చి 1 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి గమ్యాన్నే కాదు ఆ గమనంలో ఎదురయ్యే కష్టాలను కూడా ప్రేమించగలిగినవాడే విజేతగా నిలవగలడని ప్రతిభ ఉన్నవారిని ఎవరూ ఆపలేరని పేదరికం కష్టాలను పరిచయం చేస్తుంది కానీ పూర్తి అడ్డు కాదంటూ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు హన్మకొండ జిల్లా కాజీపేట నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ 25వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభోత్సవానికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంస్థ ఆడిటోరియంలో వేడుకలను బ్రహ్మానందం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి శ్రీనివాసాచార్య స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ పి శ్యామ్ ప్రసాద్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అధ్యక్షులు ప్రొఫెసర్ బి శ్రీనివాస్ హాజరయ్యారు అనంతరం డాక్టర్ కె బ్రహ్మానందం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు చాలా మంది విద్యార్థులు చదువుకోవడానికి ఆర్థికపరమైన కష్టాలు పడుతుంటారని అన్నారు చదువుకోవాలనే గమ్యం ఎంచుకున్నప్పుడు మార్గంలో ఎదురయ్యే కష్టాలను కూడా ప్రేమించాలని అన్నారు ఒకప్పుడు తాను కూడా చాలా పేదరికాన్ని అనుభవించానని అన్నారు తల్లిదండ్రులకు కలిగిన ఆరుగురు సంతానంలో తాను ఒకడిన అన్నారు