
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో గర్వకారణం
భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరోసారి జిల్లాలో తన ప్రత్యేకతను చాటుకుంది. కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులు తమ సేవలకుగాను జిల్లా స్థాయి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకొని కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.కళాశాలలో జంతు శాస్త్ర విభాగ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న డా. కొసారి సంతోష్ కుమార్ , విద్యారంగంలో వారు అందించిన విశిష్ట సేవలను గుర్తించి “ఉత్తమ అధ్యాపకులుగా ప్రశంసా నీయ అవార్డు” ప్రదానం చేయడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా, పరిశోధన, అకడమిక్ అభివృద్ధిలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు.అలాగే కళాశాలలో జాతీయ సేవ పథకం (NSS) కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పనిచేస్తూ, విద్యార్థులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆరె రాజు , వారంరోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక సేవా కార్యక్రమాలకుగాను “ఉత్తమ జాతీయ సేవా సమన్వయ కార్యకర్త ప్రశంసా అవార్డు” లభించింది. గ్రామాభివృద్ధి, శుభ్రత, అవగాహన కార్యక్రమాలలో ప్రత్యేక శిబిరాల్లో వారి సేవలు ప్రశంసలందుకున్నాయి.జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్,జిల్లా ఎస్.పి,లు శ్రీ అభిలాష అభినవ్ , ఫైజాన్ అహమ్మద్, శ్రీ మతి జానకి షర్మిల చేతుల మీదుగా అవార్డు లను అందుకోవడం అభినదనీయమని
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోళ్ళ బుచ్చయ్య మాట్లాడుతూ, “కళాశాల అధ్యాపకులు విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పని చేయడం వల్లే ఇటువంటి గౌరవాలు లభిస్తున్నాయి. ఇది మొత్తం కళాశాల కుటుంబానికి గర్వకారణం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని అవార్డు గ్రహీతలను హృదయపూర్వకంగా అభినందించారు. విద్యార్థుల కోసం చేసిన సేవలు, సమాజానికి అందించిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వారు తెలిపారు.
