పయనించే సూర్యుడు న్యూస్ 15. 09.2025 సెప్టెంబర్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం గాండ్లపల్లి లో వెలసివున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు స్వామివారి హుండీని పగలగొట్టి డబ్బులు తీసుకోవడం ఆదివారం రాత్రి జరిగింది ప్రతినిత్యం స్వామి వారి ఆలయంలో పూజలు శనివారం ప్రతి ఆదివారం ప్రతి నెలాపౌర్ణమి రోజున అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి సుమారు 500 మంది భక్తులకు ఉచిత అన్నదాన పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున పౌర్ణమి రోజున జరుగుతుంది భక్తులు కోరిన కోరికలు తీర్చే అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ విధమైన సంఘటన జరగడం రెండవసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పెద్దలు ప్రజా ప్రతినిధులు తగు చర్యలు తీసుకొనవలెనని గ్రామస్తులు కోరుతున్నారు