గాలి కుంటు టీకాలు కార్యక్రమం. పయనించే సూర్యుడు మార్చి 8 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. ఇంటింటికి తిరిగి నిర్వహించినట్లు డా.అభిలాష్ తెలిపారు.ఈ వ్యాధి వచ్చిన తరువాత వైద్యం కంటే రాకముందు నివారణ టీకాలు వేసుకోవడం మంచిదని,ఈ వ్యాధి ఒక్కసారి వస్తే పాల ఉత్పత్తి తగ్గడం,చుడి ఆఖరి దశలో ఈసుకుపోవడం మరియు గిట్టలు ఊడిపోవడం లాంటివి జరిగి రైతులు తీవ్రంగా నష్టపోతారని,ఈ టీకాలు 6 నెలలకి ఒక్కసారి వేయించుకోవాలని, ఈ టీకాలు వేయించుకోవడం వలన పాలు తగ్గిపోతాయి అని అపోహ ఉందని,రైతులు అవగాహనా కలిగి వేయించుకోవాలని వివరించారు.ఈ కార్యక్రమం లో పశు సంవర్థక సిబ్బంది చిన్నప్ప, శ్రీనివాసరావు,రాజేష్ , ఏ హెచ్ ఏ లు భార్గవి,తిరుష,మధార్,చిట్టిబాబు,రాంబాబు,రామకృష్ణ పాల్గొన్నారు.