పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 చౌడేపల్లి మండలం ప్రతినిధి జె నాగరాజ) గాలివాన తో ఓ ఇల్లు కూలింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బాధితుని కథనం మేరకు మండలంలోని పరికతన పంచాయతీ మడుకూరుకు చెందిన మునుస్వామి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు గ్రామంలో అతనికి ఒక ఇల్లు ఉంది గత రెండు రోజులుగా కురుస్తున్న జడివానకు మునుస్వామి ఇల్లు నేలమట్టమయింది ఒకవైపు మాత్రమే గోడ కూలి పడటంతో ఆ సమయంలో ఎవరు ఇంట్లో లేకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వాన సృష్టించిన బీభత్సంలో ఇల్లును కోల్పోయిన బాధితునికి ప్రభుత్వం న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు