
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
మండల కేంద్రమైన ఏన్కూరులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చినుకు పడడంతో మురుగునీరు అంతా రోడ్డుపై ప్రవహించి వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. మండల కేంద్రంలోని డ్రైనేజీలన్ని పూడిపోయి దుర్గంధం వెల్ల జల్లుతున్నాయి తున్నాయి. పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పొడి చెత్త తడి చెత్తను వేరు చేసే ట్రాక్టర్ల లో వేయాలని ప్రచారం చేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని వీధులకు ఆ ట్రాక్టర్ పోకపోవడంతో చేసేది ఏమీ లేక సైడ్ డ్రైన్ లలో వేస్తున్నారు. అయినా సిబ్బంది మాత్రం నిమ్మకు నేరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు అనటానికి పైచిత్రాలే నిదర్శనం. ఇలా మురుగునీరు నిలవడం వల్ల అనేక రోగాలన బారిన పడి ప్రజలు అనారోగ్యానికి గురికాకముందే సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వాపోతున్నారు.
