
అందే బాబన్న మరియు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే కార్యక్రమంలో పాల్గొన్న షాద్‌నగర్‌కు చెందిన యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ కు చెందిన విద్యార్థిని విద్యార్థులకు మరియు కరాటే మాస్టర్ లకు షాద్‌నగర్ బిజెపి సీనియర్ నాయకులు అందే బాబన్న మరియు శ్రీ వర్ధన్ రెడ్డి విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని చదువులతో పాటు కరాటే లో కూడా రాణించాలని మరిన్ని విజయాలు అందుకోవాలని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అందే బాబన్న మరియు మిల్లి శ్రీ వర్ధన్ రెడ్డి తో పాటు బుడో ఖాన్ కరాటే డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్, సీనియర్ మాస్టర్లు ఉత్తేజ్ యాదవ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
