
పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: మండలం సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి రాములు (70)భార్య ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు వివాహతురాలు కాగా చిన్న కూతురు మానసిక వికలాంగురాలు.గ్రామంలోని రోజువారి కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు.తన భార్య కూతురుతో కలిసి ఆర్టీసీ బస్సులో టేకులపల్లి లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు తనకు తన కూతురి పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి వెళుతుండగా మార్గమధ్యంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో బస్సులను కుప్పకూలిపోగా.వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు సిపిఆర్ చేసి టేకులపల్లి లోని రిమ్స్ హాస్పిటల్ తరలించగా డాక్టర్ పరిశీలించి చనిపోయారని నిర్ధారించారు.