
పయనించే సూర్యుడు నవంబర్ 25, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల మండలం, గుంతనాల గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన "రైతన్నా - మీకోసం" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రామంలోని రైతుల ఇంటింటికి స్వయంగా తిరిగి, "రైతన్నా - మీకోసం" పాంప్లెట్ పేపర్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు మరియు కార్యక్రమాల గురించి ఆయన రైతులకు వివరంగా అవగాహన కల్పించారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పలు చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సేవలు మరియు పథకాల గురించి రైతులకు పూర్తి స్థాయిలో వివరించారు.ఈ కార్యక్రమం నంద్యాల టిడిపి మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి , ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
