పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 1 , ఆదోని రూరల్ రిపోర్టర్ గత ఐదు రోజుల క్రిందట ఆదోని జలగర వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి దగ్దమైన గుడిసె బాధితులకు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు ఈ రోజు సంబంధిత బాధితులకు గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఆర్థిక సాయం ఇప్పించడం జరిగినది.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ మాట్లాడుతూ తెలుగు లక్ష్మీ మరియు గంగమ్మ కుటుంబాలకు స్థానిక భారత్ గ్యాస్ ఏజెన్సీ వారితో ఫోన్ ద్వారా ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి మాట్లాడి వారికి ఆర్థిక సహాయం అందించేలా చేశారు అని తెలిపినారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి మరియు భారత్ గ్యాస్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి రమాకాంత్ బిజెపి బిజెవైఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి శ్రీనివాస ఆచారి వాల్మీకి సాయి ప్రసాద్ చంద్ర మోహన్ శ్రీకాంత్ మరియు జలగర వీది కాలనీవాసులు పాల్గొన్నారు.