
పయనించే సూర్యుడు జూన్ 28 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) 5 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గున్నేపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. గ్రామ సచివాలయంలో నాయకులు స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి నాంది పలికారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:. ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి. సొసైటీ అధ్యక్షులు గొల కోటి దొరబాబు. ఎంపీటీసీ హనుమ రాజబాబుయాళ్ల ఉదయ్, గొల కోటి తాతాజీ, కామిశెట్టి శ్రీను అంగన్వాడీ స్టాఫ్ మరియు తదితరులు నాయకులు చిన్నారులకు చుక్కలు వేస్తూ, పోలియో నిర్మూలనే లక్ష్యంగా ప్రతి పిల్లవాడికి వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ "పోలియో రాకుండా కాపాడే ఏకైక మార్గం రెండు చుక్కలే. 5 ఏళ్ల లోపు పిల్లలందరూ తప్పకుండా చుక్కలు వేయించుకోవాలి" అని అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది.గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి చిన్నారులు వచ్చి చుక్కలు వేయించుకోవడంతో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.