జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
పయనించే సూర్యుడు జనవరి 21 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న )గురుకులాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కోటాలో 5వ తరగతి ప్రవేశాలు, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ గౌలిదొడ్డి, అలుగునూరు సీఓఈలలో 9వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల కొరకు ప్రవేశాలు, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఖమ్మం, పరిగి ఎస్ఓఈలలో 8వ తరగతి ప్రవేశాలు, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను కామన్ ప్రవేశ పరీక్షకు (ఇంగ్లీషు మీడియం) జిల్లా నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందు కోసం దరఖాస్తులను ఆన్లైన్ లో మాత్రమే సమర్పించాలన్నారు. అలాగే దరఖాస్తులకు చివరి తేదీ వచ్చే నెల ఫిబ్రవరి 1 అని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదిన ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనుటకు కావలసినవి
కులం సర్టిఫికేట్ నెంబరు
ఆదాయం సర్టిఫికెట్ నెంబరు
ఆధార్ కార్డు నెంబర్
బర్త్ సర్టిఫికేట్ ఫొటోలుఅదే విధంగా సర్టిఫికెట్స్ సత్వర జారీ కోసం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం 9052308621 నంబర్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, ఈ సహాయ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.