పయనించే సూర్యుడు జనవరి 15హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి... సైదాపూర్ మండలం పెరిక పల్లి లో గురుకుల పాఠశాలల ప్రవేశా ల కోసం కొల్వాపూర్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు ముద్రబోయిన అనూష ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె అన్నారు