పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు వ్యాపించిన సమాచారం తెలియడంతో వెంటనే స్పందించిన స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమ పార్టీ నేతలను గురుకుల పాఠశాల వద్దకు పంపించారు.మంత్రి ఆనం ఆదేశాలతో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థులకు వ్యాపించిన జ్వరాలపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకుని విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించారు.విద్యార్థులకు కావలసిన ఫ్రూట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, డ్రై ఫ్రూట్స్ పలు రకాల ఆహార పదార్థాలను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రమణమ్మ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్ర రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ శివకోటారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు పులిమి శైలజ రెడ్డి, నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యాధికారి సుజాత, తెలుగుదేశం పార్టీ యువ నేతలు పిడికేటి వెంకటేశ్వర్లు నాయుడు, నెల్లూరు.శివారెడ్డి, సాగర్, తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఆదేశాలతో తాము గురుకుల పాఠశాలను సందర్శించి ఇక్కడ విద్యార్థులకు పౌష్టికాహారం అందించామని అలాగే జిల్లా ప్రభుత్వ వైశాలను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకుని అవసరమైతే జిల్లా వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను సూచించినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు.