
మిత్రుడు నాగరాజు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 30 వేల రూపాయల అందజేసిన గూడ్స్ వెహికల్ యూనియన్ సభ్యులు
( పయనించే సూర్యుడు నవంబర్ 2 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ )
షాద్నగర్ గూడ్స్ వెహికల్ యూనియన్ అసోసియేషన్ సభ్యులకు నమస్కారం.
గత 15 రోజులకు క్రితం తోటి మిత్రుడు నాగరాజు కి చిన్న యాక్సిడెంట్ జరగడం వలన అతనికి తల మీద గాయం కావడంతో అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించిన తోటి మిత్రులు గూడ్స్ వెహికల్ యూనియన్ సభ్యులందరూ కలిసి తమ వంతు ఆర్థిక సహాయంగా నాగరాజు హాస్పిటల్ దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా తమకు తోచిన విధంగా నాగరాజు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం తమ యొక్క మిత్రులు అందరూ కలిసి 30.000, రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. తమ తోటి స్నేహితుడు త్వరగా కోలుకోవాలని, కోరుకుంటూ షాద్నగర్ గూడ్స్ వెహికల్ యూనియన్ తరపున ధన్యవాదాలు