
రుద్రూర్, డిసెంబర్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ గ్రామంలో గొర్రెలు, మేకలకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ టీకాలు వేశారు. రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిస్సార్ గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్, పశు వైద్య సిబ్బంది, డి. సాయిరాజ్ లైవ్ స్టాక్ అసిస్టెంట్ కే.గంగారాం, ఆఫీసు సబార్డినెట్, గొర్రెల మేకల పెంపకదారులు బోజిగొండ మల్లేష్ , బోధనం పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.