పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి ఆగస్టు 18
గోండ్వాన గోండ్ మహాసభ దక్షిణ రాష్ట్రాల పర్యటనలో భాగబగా సోమవారం చింతూరులో సెంట్రల్ కమిటీ ఆర్గనైజర్ మడివి నెహ్రూ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తరణ సమావేశం జరిగిది. ముందుగా భద్రాచలం నుండి కూనవరం మీదుగా చింతూరు వరకు ముంపు ప్రాంతం పరిశీలించి మధ్యాహ్నం నుండి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా.. ముఖ్య అతిధి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ కుమార్ నేతం మాట్లాడుతూ.. పోలవరం ముంపు నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు, పూర్తి పరిహారం అందె వరకు గోండ్వాన గోండ్ మహాసభ జాతీయ స్థాయిలో అండగా ఉంటుందని అలాగే నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ స్థానిక సమస్యలపై పూర్తి స్థాయిలో స్థానిక సంఘాలతో కలిసి పనిచేయాలనీ, స్థానిక సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యలోనే ఐక్యత సాధ్యమని స్పష్టం చేశారు. విశిష్ట అతిధి అఖిల్ గోండ్వాన కోయ పూనెం భూంకల్ సేవా సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజకుమార్ కుంజాం మాట్లాడుతూ గోండ్వాన అస్తిత్వానికి కోయ సంస్కృతి, చరిత్ర ఆధారమని దాన్ని కాపాడడం భవిష్యత్ తరాలకు సందించడం మన బాధ్యతని తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అడ్హాక్ కమిటీ ప్రకటించారు. రాష్ట్ర కన్వీనర్ గా పాడేరు నుండి రామారావు దొర, కో కన్వీనర్ ఏలూరు జిల్లా నుండి సోదేం ముక్కయ్య, రంపచోడవరం నుండి కంగాల శ్రీనివాస్, చింతూరు నుండి కాకరాజు, పాడేరు నుంచి పాంగి అంజిరావ్, లీగల్ అడ్వైజర్ గా ఆత్రం నవీన్, సలహాదారులుగా కోవాసి శ్రీనివాస్, మొడియం శ్రీనివాస్, కొండగొర్రి ధర్మారావు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలానే ఎఎస్ఆర్, ఏలూరు జిల్లా అడ్హాక్ కమిటీలను కూడా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో తోడం చంద్రయ్య, జల్లి నరేష్, సోడె నారాయణ, సోడె బాలకృష్ణ, ఉయిక రాంప్రసాద్, సోడె శ్రీను, పొడియం రామకృష్ణ, గోరం రాఘవయ్య, సోయం అర్జున్, అనిగి తిరుపతి, కాక మస్తాన్, కట్టం కరుణ్, పద్దం వంశీ తదితరులు పాల్గొన్నారు.