
తెలంగాణ ఉద్యమ నేత రామలింగం
{ పయనించే సూర్యుడు} {నవంబర్ 1} మక్తల్:
మక్తల్ మండల పరిధిలోని రుద్రసముద్రం గ్రామ సమీపంలో ప్రభుత్వ గోదాం వద్ద వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనుకు శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుడు రామలింగం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేశాక ధాన్యాన్ని నిలువ చేసేందుకు కోట్లాది రూపాయలతో గోదాంను నిర్మించింది. ఈ ప్రాంతంలో కొనుగోలు చేసిన ధాన్యం ఇక్కడే నిల్వ ఉంచుతారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని కూడా స్టాక్ పైంట్ గా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. గోదాం దగ్గర లోడింగ్ అన్ లోడింగ్ చేయడానికి కూలీలు సదుపాయం అన్ని వసతులు ఉన్నాయని.. మండలంలోని 32 గ్రామ పంచాయతీలు దాదాపు సగానికి పైగా గ్రామాల్లో పొలాలకు సాగునీరు అందడంతో రైతులు వరి సాగు చేస్తున్నారని తెలిపారు. రుద్రసముద్రం గ్రామ గోదాం రహదారి దగ్గర ఉండి అందరికీ అందు బాటులో ఉన్నందునా ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.