

పయనించే సూర్యుడు , జూలై 31 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ):ప్రస్తుతం గోదావరి నదిలో నీటి ప్రవాహం మరియు వేగం విపరీతంగా పెరిగినందున, నదీ పరివాహక ప్రాంతాల్లో లోతైన ప్రవాహాలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు, పర్యాటకులు ఎవరూ కూడా గోదావరి నదిలోకి దిగడం, స్నానాలు చేయడం లేదా ఈతకు వెళ్లడం వంటి పనులు అస్సలు చేయవద్దని, ముఖ్యంగా చిన్న పిల్లలను నదీ తీరాలకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నందున నిబంధనలను అతిక్రమించి నదిలోకి దిగే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు లేదా ఏదేని ప్రమాదం సంభవిస్తే తక్షణమే కాట్రేనికోన పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 9440900774 కు సంప్రదించి సమాచారం అందించాలని కాట్రేనికోన పోలీసులు కోరారు.