*ప్రజా పాలనంటూ ప్రజలను పూర్తిగా మోసం చేసిన రేవంత్ రెడ్డి...**
అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వానికి తొందర్లో ప్రజలె బుద్ధి చెబుతారు..**
బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షుడు సొల్లేటిగణేష్ చారి ..*
(ప్రెస్ నోట్) // నూగురు వెంకటాపురం ( ఫిబ్రవరి 8 ) : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తుపాకి రాముడి మాటలతో గారడి చేస్తూ ప్రజలను పూర్తిగా మోసం చేస్తుంది అబద్దాల ఆరు గారంటీలు అటుకెక్కి కూర్చున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నేటి వరకు అమలు చేయలేదు. రేపు రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా వాత పెడతారని బీఎస్పీ నాయకులు గణేష్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయింది గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పిదాలే ఇంకా రేవంత్ రెడ్డి కూడా అదే పంతాలో నడుస్తున్నాడు. కాంగ్రెస్ , టిఆర్ఎస్ రెండు పార్టీలను గ్రామాల్లో ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఎన్నికలు వస్తే నే గ్రామాల ప్రజలు గుర్తుకొస్తున్నారా మీకు అని ప్రభుత్వాన్ని , ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. వెంకటాపురం మండల ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు ఈసారి జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలల్లో కాంగ్రెస్ , బిఆర్ఎస్ నేతలకు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు , సమాజమంతా కూడా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) సిద్ధాంతాల పట్ల అవగాహనతో ఉన్నారు. అగ్రవర్ణ రాజకీయాలను బొంద పెట్టే రోజు జరగబోయే స్థానిక ఎన్నికల్లో జరుగుతుంది. కాంగ్రెస్ , బిఆర్ఎస్ స్థానిక నేతలకు తెలియజేశారు. పేదల పార్టీ , బహుజనులా పార్టీ బహుజన సమాజ్ పార్టీ అందరం ఏకమై స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని వెంకటాపురం ప్రజలకు బిఎస్పి అధ్యక్షులు సొల్లేటి గణేష్ చారి ప్రజలకు పిలుపునిచ్చారు. పది రోజుల క్రితం జరిగిన గ్రామ సభల్లో ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి మాటలు పచ్చి బూటకం ప్రభుత్వ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ప్రజలకు జీతగాళ్ళు ప్రజలు మీకు ఓనర్లు అనే విషయాన్ని అధికారులకు గుర్తు చేశారు. కేవలం స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ స్థానిక పంచాయితీ లల్లో గెలవడం కోసం మాత్రమే ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాం అని అంటున్నారు. ఇంకా రాని వారు ఉంటే దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ అని అసత్యపు ప్రచారం చేస్తూ ప్రజలను ఇంకా మోసగించే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు ఎవరు మీ మాయ మాటలను నమ్మరు. తొందర్లో మీకు బుద్ధి చెబుతాం అంటూ స్థానిక అధికారులపై నాయకుల పై బిఎస్పీ నేత సొల్లేటి గణేష్ చారి మండిపడ్డారు. అసలైన లబ్ధిదారులు కాకుండా పథకాలు ఉన్నవారికి ఇస్తే అసలైన లబ్ధిదారులకి బీఎస్పీ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీటంలో ప్రతిపక్షం పూర్తిగా విపలమైంది ప్రజలకు బిఎస్పి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ప్రజల పక్షాన పోరాడటం బహుజన్ సమాజ్ పార్టీ కి కొత్త కాదు నిరంతరం ప్రజలకు అందుబాటులో బీఎస్పీ నాయకులు , బిఎస్పి పార్టీ అందుబాటులో ఉంటుందని తెలిపారు.