పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న ఫిబ్రవరి 1: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చివ్వెంల గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహం హాస్టల్ ఉన్నది ఈ హాస్టల్లో 300 మంది పిల్లలు ఉంటున్నారు కాలనీలో నుంచి మురుగు నీరు రావడంతో దుర్వాసన దోమల తో చానా ఇబ్బంది పడుతున్నామని ప్రిన్సిపాల్ కవిత అన్నారు ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహం హాస్టల్ లో 300 మంది పిల్లలు ఉంటారు ఈ హాస్టల్లో మురుగునీరు నుంచి వచ్చే దుర్వాసనతో భరించలేకపోతున్నామని అధికారులకు చెప్పిన పట్టించుకోవట్లేదని గ్రామాల్లోని అధికారులకు చెప్పిన పట్టించుకోవట్లేదు హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉండేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వెంటనే డ్రైనేజీ పనులు ప్రారంభించాలని మురుగునీరు ఇక్కడ ఆగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు హాస్టల్ పిల్లలే కాదు గ్రామాల్లోని ప్రజలు కూడా చానా ఇబ్బంది పడుతున్నారు సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది ఒక్కో అధికారికి రెండు మూడు గ్రామాలు బాధితులు ఉండడంతో పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారింది డ్రైనేజీలు లేకపోవడంతో దశాబ్దాల కిందట నిర్మించినవి కావడం ఆధునికీకరుణకు సమస్య మరింత తీవ్రమవుతుంది కాలవల్లో చెత్త తోలగించకపోవడంతో మురుగునీరు పారడం లేదు పన్నులు చెల్లిస్తున్నాం కనీసం మౌలిక వసతులు కల్పించండి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న పాలకులు అధికారులకు పట్టడం లేదు మండలంలోని ప్రాంతాల్లో మురుగు కాలువలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది నిర్వాణ పేరిట వేట కోట్లు ఖర్చు చేస్తున్న ఆశించిన ఫలితం రావడం లేదు పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీలు లేకపోవడం దశాబ్దాల కిందట నిర్మించినవి కావడం వాటిని పర్యవేక్షణ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే పై అధికారులు చర్యలు తీసుకొని పారిశుధ్యంపై పర్యవేక్షణ పనులు ప్రారంభించాలని రోడ్లుపై మురుగునీటితో స్థానికులు అవస్థలు పట్టించుకునే వారు లేరని స్థానికులు గ్రామంలోని ప్రజలు అంటున్నారు.