(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్)
రాయపోల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్ను రూ.6016కు పెంచాలని, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ను రూ.4016కు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు మాసంపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం మానిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు.కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గల్వ సంతోష్ రెడ్డి, సిద్ధిపేట్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు అరికేల సత్తయ్య, కుమ్మరి స్వామి, ఇప్ప నారాయణ, ఇప్ప రాములు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.