
పయనించే సూర్యుడు జూలై 31 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లాసూళ్లూరుపేటకు చెందిన శ్రీ
సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు “మొక్కలు నాటుదాం.. ప్రకృతిని కాపాడుకుందాం” అనే నినాదంతో కేసీఎన్ గుంట గ్రామంలో హరిత కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు తమ చిట్టి చేతులతో ఇంటింటికీ వెళ్లి మొక్కలను పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ పెద్దలు, స్థానికుల సహకారంతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితేనే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని విద్యార్థులు తమ చర్యల ద్వారా చాటి చెప్పారు. చిన్న వయస్సులోనే ప్రకృతిపై బాధ్యతను అలవర్చే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఎదుమది గ్రూప్ ఎన్జీవో సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధానోపాధ్యాయురాలు కంచర్ల సులోచన, అధ్యక్షురాలు మన్నెముద్దు పద్మజా, కార్యదర్శి గంగాధరం, బండారు శారదతో పాటు గ్రామ పెద్దలు పాల్గొని చిన్నారులను అభినందించారు. కార్యక్రమం గ్రామంలో పచ్చదనంపై కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చింది.