

త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జులై 9 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం, యువతలో ప్రతిభను వెలికితీయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం కొందుర్గు మండల కేంద్రంలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో మంజూరైన మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్ సిద్ధార్థకు పలు సూచనలు చేశారు.స్టేడియం కోసం కేటాయించిన భూమికి సంబంధించిన సర్వేను వెంటనే పూర్తి చేసి, ఎలాంటి జాప్యం లేకుండా నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ సిద్ధార్థ కూడా వేగంగా పనులు ప్రారంభించేలా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు, మినీ స్టేడియంల ఏర్పాటు వల్ల యువతకు మెరుగైన శిక్షణా అవకాశాలు లభిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
క్రీడా మౌలిక వసతులు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల వైపు ఆకర్షితులవుతారని, స్థానికంగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని, గ్రామీణ క్రీడాకారులకు నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కొందుర్గు మినీ స్టేడియం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత యువతకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి,ఏఎంసీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, , సయ్యాద్ సాదిక్ మల్లేష్ గౌడ్,రాములు గౌడ్ కేకే కృష్ణ,సర్పంచులు అంజి, ఫయం, జంగీర్, వీరేందర్ రెడ్డి జీబీ కృష్ణ,బోరేగ నరేందర్, బొట్టు శ్రీను, గుట్ట రాజు, నర్సింహా రెడ్డి, రవీందర్ రెడ్డి,గాలి శ్రీను,నాగులపల్లి శివకుమార్,మామిడిపల్లి రవి, ద్వేజేందర్, కోయల నర్సింలు,ఫిల్వన్, కటిక రఘు జమల్పూర్ నరేందర్,శ్రీనాథ్ రెడ్డి,జగన్మోహన్ రెడ్డి, రమేష్ పామేనా, కుమార్, శివకుమార్, వేమా రెడ్డి, కాంట్రాక్టర్ సిద్ధార్థ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీనాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు..