మన ఇంటి మందం మన పంట..
పయనించే సూర్యడు //ఫిబ్రవరి //15// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ //కుమార్ యాదవ్. గ్రామ నవ నిర్మాణ సమితి "(జి ఎన్ ఎన్ ఎస్ కేవీకే " )ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో భాగంగా "మన ఇంటి మందం మన పంట"(ప్రకృతి వ్యవసాయం) అనే సంకల్పంతో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి లో లభించే సహజ వనరులతో వ్యవసాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలని మన ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని దీని ముఖ్య ఉద్దేశం అని కేవీకే ప్రకృతి వ్యవసాయం ఎస్ లెటర్ గిరవేన అభిషేక్ యాదవ్ తెలిపారు..ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ప్రకృతి లో కాలుష్యం నివారించవచ్చు ఇందులో భాగంగా శుక్రవారం జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో పుల్లూరి సారయ్య , వారి యొక్క పొలం వద్దా రైతులు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో భాగమైనారన్నారు.దీనిలో భాగంగా 20 గుంటలు వ్యవసాయ భూమికి 100లీటర్ల జీవామృతం (ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పుల పిండి , రసాయనాలు కలపని మట్టి లేదా పుట్ట మట్టి ) తయారు చేయడం జరిగిందన్నారు . జీవామృతం పారించడం వల్ల భూమిలో ఉన్న మేలుచేసే సూక్మజీవుల సంఖ్య పెరిగి భూసారం పెరుగు తుందన్నారు. తద్వారా ఆరోగ్య కరమైన మరియు నాణ్యమైన పంట వస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఫెసిలెటర్ గిరవేన అభిషేక్ యాదవ్, తాటికంటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్ . వెంకటేశ్వర పల్లి గ్రామ కరోబర్ అసాల సరయ్య, గ్రామ రైతులు పుల్లరి ఆకాష్,రాజు తదితర రైతులు పాల్గొన్నారు.