
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో మరియు ఎంపీఓ
( పయనించే సూర్యుడు జనవరి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లోని కడియాలాకుంటా తాండలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం శుక్రవారం భూమి పూజా చెయ్యడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మూడవత్ రాజు నాయక్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫరూక్ నగర్ ఎంపీడీవో బన్సిలాల్ మరియు ఎంపిఓ జయంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ సర్పంచ్ మూడవత్ రాజు నాయక్ చౌహాన్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి జంగయ్య, డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్, మరియు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
