
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 12 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) ఐ పోలవరం మండలం భాణాపురం శ్రీసత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సత్తెమ్మతల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోపూజ భూ సుపోషణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకురాలు శ్రీ అనంత లక్ష్మీ పాల్గొని ముందుగా మాతృమూర్తుల చే లలితా పారాయణ చేసి గోపూజ భూ పూజ అనంతరం అనంతలక్ష్మి గారు మాట్లాడుతూ ఆవు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆవు తల్లితో సమానం అటువంటి ఆవుని రక్షిస్తూ గో సంపద పెరిగితే దేశ సంపద పెరుగుతుందన్నారు మానవుడు ఆరోగ్యంగా జీవించడానికి దేశవాళీ ఆవు యొక్క పాలు శ్రేష్టమైనవి అన్నారు ఆవు ద్వారా లభించే గోమయం గోమూత్రం పాలు పెరుగు నెయ్యి మొదలగునవి మనిషి సంపాదన పెంచుతాయన్నారు అలాగే వీటిని ఉపయోగించి గో ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి కల్తీ లేని సమాజాన్ని నిర్మించడం కోసం పరిపూర్ణానంద స్వామీజీ ప్రయత్నం చేస్తున్నారన్నారు భూమిని కెమికల్స్ మయం చేయడం వలన భూసారం తగ్గి పంటల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు ఈ కార్యక్రమంలోసాగిరాజు శ్రీనురాజు పేరాబత్తుల రామకృష్ణారావు ధర్మప్రచారక్ బొంతు కనకారావు బి.లక్ష్మీనారాయణ కొలుకోటి కృష్ణమూర్తి తోట వెంకటేశ్వరరావు(బుజ్జి) తోట రామచంద్రరావు తెలగారెడ్డి రామచంద్రమూర్తి తోట చిరంజీవి మార్కండేయ దేవు నాగేశ్వరరావు సలాది శ్రీనివాసరావు రెల్లు గంగాధరం పాటి వీరన్నబాబు మెర్నేడి రాంబాబు గుత్తుల వెంకటేశ్వరరావు నూలు వల్లి గాదిరాజు దేవి కొప్పరావూరి మణి గాంజా భాస్కరలక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.