
గ్రేస్ గార్డెన్ పాఠశాల హెడ్ గర్ల్ గా సహస్ర హెడ్ బాయ్ గా వర్షిత్
పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్నగర్ పట్టణంలోని గ్రేస్ గార్డెన్ పాఠశాలలో బుధవారం పాఠశాల ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి తమ్ముకున్నచిన తమ తోటి విద్యార్థులను పాఠశాల లీడర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ అయిషా బాబు ఇతర ఉపాధ్యాయునిలు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. గ్రేస్ గార్డెన్ స్కూల్ హెడ్ గర్ల్ గా సహస్ర హెడ్ బాయి గా వర్షిత్ ఎన్నికయ్యారు. విద్యార్థులు చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ ఐషా బాబు మీడియాకు తెలిపారు.