
పయ నించే సూర్యుడు జూలై 5 ముమ్మిడారం ప్రతినిధి గ్రంధి నాది : గిరిజన హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన "నిజమైన వీరుడు" అల్లూరి సీతా రామరాజు అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ను అన్నారు.. మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో జరిగిన అల్లూరి సీతా రామరాజు జయంతి సందర్బంగా మంత్రి విచ్చేసి సీతారమరాజు విగ్రహానికి పూలమాలలు అర్పించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ను ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణ రావు కలసి కోటిపల్లి - నరసాపురం రైల్వే ప్రాజెక్ట్ త్వరిత గతిన పూర్తిచెయ్యాలని వినతిపత్రం సమర్పించారు.. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.అనంతరం ఎమ్మెల్సీ కుడుపూడి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ధైర్యం నేటి యువతరానికి ఆదర్శమని తెలిపారు. ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవవీరుడని పేర్కొన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు అల్లూరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చి రాజు, భూపతిరాజు ఈశ్వర రాజు,ఈ ఆర్ ఎస్ సుబ్రహ్మణ్యం , నల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు