పయనించే సూర్యుడు అన్నమయ్య జిల్లా మే12 టీ సుండుపల్లి మండలం
సుండుపల్లె : మండల కేంద్రంలో వెలసిన ఆరెమ్మ తల్లి తిరుణాల మహోత్సవాన్ని మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఎర్రపు రెడ్డి ఆరం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం అమ్మవారు పత్తి వాండ్ల పల్లె నుండి అంగరంగ వైభవంగా మేళ తాళముల నడుమ ఊరేగింపుగా బయలుదేరి దేవాలయంలో అమ్మవారి సన్నిధానానికి చేరుకుంటారని తెలిపారు.మంగళవారం ఉదయాన్నే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యుత్ దీపాలంకరణతో చాందిని బండ్లు ప్రదక్షిణలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను సేకరించి,తిరుణాల మహోత్సవాన్ని తిలకించవలసిందిగా ఆయన కోరారు.