పయనించే సూర్యడు // మార్చ్ // 20 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు ముస్లిం నేతలు ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో ఈటల రాజేందర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఎండి నసీరుద్దీన్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలంగాణ రాష్ట్రంలోనే హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంది అన్నారు.ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రతి పేదవానికి ఏదో రకంగా సహాయం అందించారని ఆయన పేర్కొన్నారు.ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా గెలిచినప్పటికీ హుజురాబాద్ అంటే ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నాడని హుజురాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఈటలతోనే సాధ్యమని అన్నారు.ఈటల రాజేందర్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని ఉన్నత పదవులు వచ్చేలా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ పాషా, మహమ్మద్ యాకూబ్ తదితరులున్నారు