పయనించే సూర్యుడు గాంధారి 02/08/25
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గాంధారి మండల కేంద్రంలోని దుర్గా నగర్ కాలనీ యందు ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు ప్లేటు, గ్లాసు అందించరూ స్కూల్ ఆవరణలో చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తూర్పు రాజు, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతి సెక్రటరీ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల లక్ష్మణ్, లైన్ రమేష్, కామెలి బాలరాజ్, సంగని బాబా, అహ్మద్,మహిళ నాయకులు శోభ,వసుంధర లు, అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.