ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్.
పయనించే సూర్యుడు: జనవరి 18: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.... వాజేడు: ములుగు జిల్లా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ములుగు జిల్లా ఇన్చార్జి అచ్చునూరి కిషన్ శుక్రవారం హైదరాబాద్ క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజా గొంతుక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు అభిమానులు టీం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కి శాలువా కప్పి, తీన్మార్ మల్లన్న ఫోటో చిత్రపటాన్ని జ్ఞాపికగా ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీమ్ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్ స్టేషన్ ఘనపూర్ ఇంచార్జీ బాణాల రాజుకుమార్, భూతుకూరి శ్రీధర్, దురిశెట్టి విజయ్, కొమ్మ శ్రీనివాస్, మార్త శ్రీనివాస్, భూశెట్టి శ్రీకాంత్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.