
పయనించే సూర్యుడు నవంబర్ 4,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల పట్టణంలోని భగత్ సింగ్ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ జి.మద్దయ్య యాదవ్, నంద్యాల నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు మాదాల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఏ.జగన్ మోహన్, సహాయ కార్యదర్శి ఇక్బాల్ హుస్సేన్, ఆంధ్రప్రభ ఇన్చార్జి నాగవర్ధన్ రెడ్డి, నాయకులు సోమశేఖర్, సుబ్బరాయుడు, కిరణ్, శేఖర్ యాదవ్, కుమారస్వామి, జాకోబ్, వెంకట్, గంటల గిరి, గోపాజి సత్యమన్న తదితరులు పాల్గొన్నారు.