పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు వచ్చి అందరి మన్నలను పొందుతూ ఐదు సంవత్సరాలు కాలంలో అనేక సేవా కార్యక్రమం చేస్తున్న గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు స్వరూప్ పలివెల చేస్తున్న సేవలు అభినందనీయమని ముఖ్య అతిథి వైకాపా రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మరియు గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి పేర్కొన్నారు. శనివారం కాకినాడ అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన ఐదవ వార్షికోత్సవ విజయోత్సవ సభకు వచ్చిన వారందరికీ సంస్థను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ సంస్థ మొదటి నుంచి ఎంతో ప్రోత్సాహించిన జమ్మలమడక నాగమణి రామ శర్మ దంపతులు మాకు ఎంతో ప్రోత్సాహాని ఇచ్చారని వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. జమ్మలమడక నాగమణి గుస్సాలువతో ద ఇన్స్పిరేషన్ అవార్డును మెమొంటోను అందజేశారు. ముందుగా ఐదవ వార్షికోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు బుక్స్, బ్యాగులు స్టేషనరీ మరియు తండ్రి లేని నిరుపేద ఇద్దరు పిల్లలకు సైకిల్ లను ముఖ్య అతిథి జమ్మలమడక నాగమణి చేతుల మీదగా అందించడం జరిగింది. అలాగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రియాంక, సుధారాణి, వాసన్ కంటి వైద్య సిబ్బంది, శ్రీ ఆదిత్య హాస్పిటల్ సిబ్బంది, హాసిని డెంటల్ క్లినిక్ సిబ్బంది మరియు మిషన్ అన్నపూర్ణ సహాయనిది ప్రతినిధి దేవత రాజేష్ కుమార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.