
{పయనించే సూర్యుడు} న్యూస్ జనవరి 29మక్తల్ }
మక్తల్ మండలంలోని ఉప్పరపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాల యందు గ్రామానికి చెందిన చంద్రశేఖర్(అంజి) అనే ఆటో డ్రైవర్ తన కుమారుడు అవినాష్ జన్మదినాన్ని పాఠశాల విద్యార్థుల మధ్య నిరాడంబరంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ గారు మాట్లాడుతూ చంద్రశేఖర్(అంజి) తన కుమారుడు యొక్క జన్మదినాన్ని వ్యక్తిగతంగా కాకుండా పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం ద్వారా సేవాభావం మానవత్వం సామాజిక బాధ్యతకు చక్కటి ఉదాహరణ నిలిచాడని, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో పంచుకోవడం, ప్రేమా, మానవీయ విలువలను నాటుతాయని, ఈ ఆలోచన మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.అనంతరం చంద్రశేఖర్ దంపతులను పాఠశాల తరఫున శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిద్దు,శివప్ప, రవి, తాయాప్ప, నాగరాజ్ గౌడ్, నరేష్, శివకుమార్ ఉపాధ్యాయులు పావని జగదీష్ పాల్గొన్నారు.
