
అద్భుతంగా వైజ్ఞానిక ప్రదర్శన
మూఢనమ్మకాల ను నిర్మూలించి, ప్రశ్నించడం అలవర్చుకోవాలి. ఉపాధ్యాయులు
{పయనించే సూర్యుడు }{మార్చ్ 1 మరికల్}
మరికల్ మండల కేంద్రంలో ని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ వైజ్ఞానిక దినోత్సవ సందర్భంగా పాఠశాల లో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన లో విద్యార్థులు రక్త ప్రసరణ వ్యవస్థ, గుండె కిడ్నీ చెవి ల పని తీరు, ఎలక్ట్రిక్ బెల్ ,ఆటోమేటిక్ రోడ్ స్ట్రీట్ లైట్స్ , రాకెట్ ప్రయోగం మొదలగు అనేక ప్రయోగ కృత్యాలు నిర్వహించారు. మంచి ప్రయోగ కృత్యాలు చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేశ్, సైన్స్ ఉపాధ్యాయులు రమేష్, అజిమ్, శ్రీవాణి మరియు ఉపాధ్యాయులు శివ శంకర్, సంజీవ్ , శ్రీనివాస్, హిమాన్షు, వెంకటేష్, భారతి , లక్ష్మీ ప్రసన్న, మహమ్మది , శివ, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
