మహిళలు, కార్మికుల హక్కుల కొరకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్..
అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి..
అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్..
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 15:- రిపోర్టర్ (కే శివకృష్ణ )
న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్ అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా సోమవారం జనసేన నాయకులతో కలిసి స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.. తొలుత కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మార్కెట్ ఫ్లైఓవర్ దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, తో కలిసి అంబేద్కర్ కు నివాళులర్పించారు.. ఈ సందర్భంగా విన్నకోట సురేష్ మాట్లాడుతూ; దేశంలో మహిళలు, కార్మికుల హక్కుల కొరకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారన్నారు. అంటరాని కుటుంబంలో పుట్టి, మహా వ్యక్తులలో మహోన్నతుడుగా ఆయన ఎదగడానికి కారణం విద్య ఒక్కటే కాదని దానికి తోడుగా కార్యసిద్ది కూడా ఉండాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి రాజ్యాంగ రూపకల్పనకు విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని అవలంబిస్తూ పరిపాలన సాగించడం జరుగుతుందన్నారు. అటువంటి వ్యక్తిని ఈ పుడమి ఉన్నంతవరకు గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి మాట్లాడుతూ; పేద బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి ఎనలేనిది అన్నారు. మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని, రాజ్యాంగ నిర్మాతగా స్వాతంత్ర భారత దేశ కార్మిక మంత్రిగా పనిచేశారని కార్మిక చట్టాన్ని, వారి హక్కుల కొరకు రాజ్యాంగంలో స్థానం కల్పించారన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించి వారు ఉన్నతకి ఎనలేని కృషి చేశారని ఈ సంధర్బంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల అధ్యక్షుడు గోట్టిపాటి శ్రీకృష్ణ, బాపట్ల నియోజకవర్గ జనసైనికులు పసుపులేటి మహేష్, విష్ణుమొలకల చంద్రమోహన్, పడమటి ధర్మారావు, కామిశెట్టి సాయిబాబు, కోకి రాజశేఖర్ రెడ్డి, సంగీత ఏసోబు, అంకిరెడ్డి అనూష్, దాసరి వినోద్, మడసాని బాలాజీ, కంచర్లపల్లి నరేంద్ర, దండుప్రోలు కిషోర్, మేకల కార్తిక్, మేకల విజయ్ కుమార్, పాలపర్తి నాగేశ్వరరావు, పాలపర్తి శ్రీను, దండుప్రోలు బాలకోటి, పన్నటి పోలురాజు, చింత దుర్గ ప్రసాద్, దొంతి కిషోర్, దొంతి కిరణ్, చిల్లర గోకుల్ తరుణ్, గావిని జేస్వంత్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు…