పయనించే సూర్యుడు న్యూస్ జూలై 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
చందానగర్‌లోని మోషన్ ఒలింపియాడ్ స్కూల్ ప్రాంగణంలో శనివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో మరియు సాంస్కృతిక వైభవంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవంలో విద్యార్థులు పోతురాజు, మహాకాళి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో పరిమళించిన విద్యార్థుల నృత్యాలు, పాటలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి స్కూల్ ఛైర్మన్ ఉదయ్ రెడ్డి ముఖ్య అతిథి గా విచ్చేశారు, తెలంగాణ లో బోనాల పండుగ యొక్క విశిస్టత గురించి ప్రసంగించారు, పిల్లలను అభినందించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సునీత బోనాల పండుగ గురించి వివరంగా వివరిస్తూ, ఇది మన పూర్వీకుల ఆ చారాలను తెలియజేసే గొప్ప వేడుక అని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను బహుమతులతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హాజరై పిల్లల ప్రతిభను మెచ్చుకున్నారు. బోనాల వేడుకలు స్కూల్ వాతావరణాన్ని ఓ ఆధ్యాత్మిక మహోత్సవంగా మార్చాయి