పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 26 టంగుటూరు రిపోర్టర్ తుల్లిబిల్లి క్రాంతి కుమార్:- టంగుటూరు మండలం జమ్మలపాలెం హైస్కూల్ నందు 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెజవాడ హరిబాబు, గ్రామ సర్పంచ్ రావూరి స్నేహ, ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ స్నేహ మాట్లాడుతూ ఈరోజు ఈ గ్రామానికి నేను ఒక మహిళా సర్పంచిగా ఈ గ్రామం కి,ఈ దేశానికి రాష్ట్రపతి ఒక ద్రౌపతి ముర్ము ఒక మహిళ రాష్ర్ట పతి గా ఉన్నాము అంటే దాని కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు, ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని ఏమీ సదుపాయాలు లేనటువంటి రోజుల్లోనే అన్ని కోరికలు చంపుకొని బాగా చదువుకొని ప్రపంచ మేధావిగా ఎదిగి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదగటం నేటికి, ఏనాటికి అంబేద్కర్ గారే స్పూర్తి అని సర్పంచ్ స్నేహ తెలిపారు.ఈ సందర్భంగా బెజవాడ హరిబాబు మాట్లాడుతూ ఈ దేశం నుంచి ఎంతోమంది విదేశాలకు వెళ్లి చదువుకోవటానికి, డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తున్నారు, తిరిగి మాతృదేశానికి సాయం అందించడానికి ముందుకు రావట్లేదు, కానీ ఆ రోజుల్లోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనేక ఇబ్బందులు పడి స్కాలర్షిప్లు తీసుకొని విదేశాల్లో చదువుకొని "విజ్ఞానాన్ని సంపాదించాడు.. తప్పక డబ్బులు సంపాదించలేదని" డబ్బులు సంపాదించే పని అయితే విదేశాల్లోనే ఉండేవాడు అని "అంబేద్కర్ దేశం మీద ప్రేమతో లక్షల కోట్ల కన్నా విలువైన జ్ఞానంతో ఈ భారతదేశానికి వచ్చి" రాజ్యాంగాన్ని నిర్మించి ఆడవాళ్ళకి ,,మగవాళ్ళకి కులాలకి, మతాలకి అతీతంగా దేశం అభివృద్ధి చెందటానికి హక్కులు కల్పించినటువంటి మహోన్నతుడు అంబేద్కర్ గారు, ఆయనే మాలాంటి వారికి ఆదర్శం అని హరిబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కే శ్రీనివాసరావు , గ్రామ పెద్దలు అన్నాబత్తి వెంకటేశ్వర్లు, రాము , పి.డి టి. అశోక్ బాబు, సరస్వతీ దేవి, సుకన్య, అన్నపూర్ణ, బిల్లా శ్రీనివాసరావు, రాబర్ట్, రమేష్, రమణ, నారాయణ, విద్యార్థిని విద్యార్థులకు గ్రామస్తులకు భారత రాజ్యాంగము గణతంత్ర దినోత్సవ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు*