పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది.అదేవిధంగా నిజామాబాద్ నగరంలో పలు సేవా సంస్థలలో సేవక్రమాలు,ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరుగుతున్న సందర్భంలో నిజామాబాద్ నగరంలో కూడా ఉదయం నుండి సేవా కార్యక్రమాలు వివిధ ఆలయాలలో అర్చనలు జరుగుతున్నాయని ,మహేష్ కుమార్ గౌడ్ కి పుట్టినరోజు కానుకగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న కృషిని విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది అని తెలిపారు. ఆ భగవంతుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఆయురారోగ్యాలు ప్రసాదించి క్షేమంగా ఉండాలని జిల్లా మరియా నగర ప్రజల తరపున కోరుకున్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సేవా సంస్థలలో సేవా కార్యక్రమాలు, వివిధ ఆలయాలలో మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది అని ,అదే విధంగా కాంగ్రెస్ భవన్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అని కేశ వేణు తెలిపారు, మహేష్ కుమార్ గౌడ్ బీసీ నాయకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తూనే అన్ని వర్గాలను సమానంగా చూస్తున్న నాయకుడు అని మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి ,రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, పిసిసి ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, పిసిసి మాజీ కార్యదర్శి రాంభూపాల్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా పార్లమెంట్ మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ జిల్లా సేవల అధ్యక్షులు సంతోష్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ మహిళా కాంగ్రెస్ నాయకులు మఠం రేవతి,సుజాత, పోల ఉష, విజయలక్ష్మి, విజయ, అపర్ణ, అవిన్ ,కొండపాక రాజేష్,సిరికొండ గంగారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు