
పయ సూర్యుడు ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సోదరుడు దాట్ల పృధ్విరాజ్ పుట్టినరోజు వేడుకలు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో , ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొని కేకులు కట్ చేసి పృథ్వీరాజ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముమ్మిడివరం అన్న క్యాంటీన్లో ఉచితంగా పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. అలాగే పోలమ్మ చెరువు గట్టున ఉన్న మూగ చెవిటి పిల్లలకు ఫ్రూట్స్ బిస్కెట్లు పంపిణీ చేశారు. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు పంపిణీ చేశారు. ముమ్మిడివరం టిటిడి కళ్యాణ మండపం వద్ద కర్రా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పృధ్వీరాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే లంక తల్లమ్మ గుడి, మార్కెట్ సెంటర్, బాలయోగి గుడి సెంటర్, క్రాప చింతలపూడి సెంటర్, బొండాయకుడు తూము సెంటర్, సోమిదేవరపాలెం లలో పృథ్వీరాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, చెల్లి అశోక్, గొల్ల కోటి దొరబాబు, సాగిరాజు సూరిబాబు రాజు, కాకర్ల రాజేష్, దొమ్మేటి రమణ కుమార్, అర్ధాని శ్రీనివాసరావు, ములపర్తి బాలకృష్ణ, కట్ట సత్తిబాబు పొద్దోకు నారాయణరావు, సరిపెల్ల శ్రీను రాజు,తాడి జానకిరామ్, దాట్ల బాబు నడింపల్లి సుబ్బరాజు,గొల్లపల్లి గోపి, చిక్కాల అంజిబాబు, ఏళ్ల ఉదయ్, పిల్లి నాగరాజు,పాయసం చిన్ని, కడలి నాగు, అడబాల సతీష్ కుమార్, మిమితి చిరంజీవి, బొక్క రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, కుడిపూడి మల్లేశ్వరి, ప్రసన్న, కాకి మాణిక్యం, నిమ్మకాయల విషు, జాగు సత్తిబాబు, చింతలపూడి బాబురావు, శివ, రెడ్డి శ్రీను, రెడ్డి సుబ్బారావు, ఎస్ఎంఎస్ ప్రసాద్, కటికీదల నాని, పితాని నరసింహమూర్తి, లోకనీడి వెంకటేశ్వరరావు, చెల్లి సురేష్, నారాయణరావు, సురేష్,ఉంగరాల వెంకటేశ్వరరావు,జనపల్లి సత్యనారాయణ, కాశి లాజర్, నీతి పూడి వంశీ, కాశి రామచంద్రరావు, జెడి, నడింపల్లి శ్రీనివాసరాజు, బూరుగు కళ్యాణ్, చింతలపూడి కొండబాబు, లతో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
